ఏపిలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ వార్తలు అవాస్తవం: డీఎంఈ
- December 03, 2022
అమరావతి: ఏపీలోని వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించకూడదని.. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశించినట్టుగా వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. అమ్మాయిలు చీర, చుడీదార్‌తో రావాలని, జుట్టును వదులుగా వదిలేయొద్దని, పురుషులైతే క్లీన్ షేవ్‌తో రావాలంటూ డీఎంఈ ఆదేశించినట్టు వార్తలు హల్చల్ చేశాయి.
తీవ్ర చర్చనీయాంశమైన ఈ వార్తలపై డీఎంఈ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను నమ్మొద్దని, ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
విధుల్లో ఉన్న సమయంలో ఆరోగ్యశాఖ ఉద్యోగులు, వైద్యులు స్టెతస్కోప్, యాప్రాన్, ఐడీ కార్డు ధరించాలన్న అంశంపై ఉద్యోగ, ఇతర సంఘాల నాయకులతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని డాక్టర్ వినోద్ కుమార్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







