సౌదీలో 2.4 మిలియన్ల క్యాప్‌గాన్ మాత్రలు స్వాధీనం
- December 04, 2022
జెడ్డా: జెడ్డా, ఎంప్టీక్వార్టర్ పోర్ట్‌లలో 2.4 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించడానికి చేసేన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రకటించింది. ఈ రెండు కేసుల్లోనూ ఓడరేవుల ద్వారా సౌదీ అరేబియాకు వచ్చిన సరుకుల్లో దాచిన క్యాప్‌గాన్ మాత్రలను గుర్తించిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ZATCA తెలిపింది.
మొదటి కేసును ఎంప్టీక్వార్టర్ పోర్ట్‌లో అడ్డుకున్నామని, ఒక షిప్ మెంట్ లో దాచిన 1.2 మిలియన్ కంటే ఎక్కువ క్యాప్‌గాన్ మాత్రలను గుర్తించామని పేర్కొంది. ఇక జెడ్డా ఇస్లామిక్ ఓడరేవులో రెండో ప్రయత్నాన్ని అడ్డుకోగా, సిమెంట్ సరుకులో దాచిన 1.2 మిలియన్ కంటే ఎక్కువ క్యాప్‌గాన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసులకు సంబంధించి 6 మందిని అరెస్టు చేసినట్లు జాక్టా పేర్కొంది. జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్ ప్రయత్నాలను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని జాక్టా పిలుపునిచ్చింది. స్మగ్లింగ్ గురించిన పక్కా సమాచారం అందించిన వ్యక్తికి ఆర్థిక బహుమతిని అందిజేస్తామని ZATCA ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







