ఫుట్ బాల్ అభిమానులు గుడ్ న్యూస్: టిక్కెట్లు లేకున్నా ప్రపంచ కప్‌కు హాజరుకావచ్చు
- December 04, 2022
దోహా: ఫుట్ బాట్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖతార్ కొత్త హయ్యా కార్డ్ ఆప్షన్ ను ప్రారంభించింది. ఇది గ్రూప్ దశ ముగిసిన తర్వాత టిక్కెట్ లేని అభిమానులను దేశంలోకి ప్రవేశించడానికి, FIFA ప్రపంచ కప్‌కు హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుంది. టిక్కెట్లు లేని అభిమానులను హయ్యా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే 'ఎర్లీ డిసెంబరు' ఫీచర్ డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత చెల్లుబాటు అవుతుంది. అభిమానులు హయ్యా కార్డ్‌ని పొందేందుకు, ప్రవేశించడానికి వసతి రుజువును చూపించి QR500 ప్రవేశ రుసుమును చెల్లించాలి. 12 ఏళ్లలోపు పిల్లలకు ఛార్జీ విధించబడదు. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానులకు హయ్యా కార్డ్ తప్పనిసరి. ఇది చెల్లుబాటు అయ్యే మ్యాచ్ టిక్కెట్‌తో స్టేడియంలకు యాక్సెస్, FIFA ఫ్యాన్ ఫెస్టివల్‌కు ప్రవేశం, ఉచిత ప్రజా రవాణాను అందిస్తుంది. హయ్యా కార్డ్ హోల్డర్లను 2023 జనవరి 23 వరకు ఖతార్‌లో ఉండే అవకాశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







