హైదరాబాద్ లో భారతదేశపు తొలి గోల్డ్ ఏటీఎం
- December 04, 2022
హైదరాబాద్: ఏటీఎం అంటేనే డబ్బు విత్‌డ్రా చేయడం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం కూడా డ్రా చేసుకోవచ్చు. ఏంటి బంగారం ఏటీఎం నుంచి డ్రా అనే అనుమానమే వద్దండోయ్.
మీరు విన్నది నిజమే… దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. గోల్డ్ ఏటీఎం లో ఇప్పుడు వినియోగదారులు తమ డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఏటీఎం నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్‌లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి స్వచ్ఛత బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్‌లో గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు గురించి గోల్డ్ సిక్కా సీఈవో సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ… ‘ఈ బంగారు నాణేల ద్వారా 99.99 శాతం నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డులను కూడా వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు. కాగా, ఈ మిషన్లలో రూ. రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల ముడిసరుకు లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏటీఎంలు ఉదయం 9.50 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అనంతరం మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని సయ్యద్ తెలిపారు. పాతబస్తీ, సికింద్రాబాద్, అబిడ్స్‌లో మూడు ఏటీఎంలతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లో గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలు తెరవనున్నారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







