వివాహానికి నో.. BD1,500 చెల్లించాలని మహిళను ఆదేశించిన షరియా కోర్టు
- December 05, 2022
బహ్రెయిన్: వివాహం చేసుకుంటానని BD1,500ని మహర్‌గా అంగీకరించిన ఒక మహిళ.. ఆ తర్వాత వివాహం చేసుకోనని తప్పుకున్నది. దీంతో షరియా కోర్టు డబ్బును తిరిగి ఇవ్వాలని సదరు మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వధువు కుటుంబం వారు వివాహానికి అంగీకరించినందుకు కాబోయే వరుడిని BD1,700 బహుమతిగా చెల్లించాలని కోరింది. ఆ వ్యక్తి నవంబర్ 2020లో చెల్లించాడు. అయితే, నిశ్చితార్థానికి నెల రోజుల ముందు.. వివాహం ఇష్టపడటం లేదని అమ్మాయి చెప్పింది. దీంతో BD1,700 తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబం కోరారు. కానీ అమ్మాయి తరఫువారు అంగీకరించలేదు. కేవలం BD200 మాత్రమే తిరిగిచ్చారు. దీంతో అతడు షరియా కోర్టును ఆశ్రయించాడు. జాఫరీ కుటుంబ చట్టంలోని ఆర్టికల్ 4ను ఉటంకిస్తూ.. వివాహాన్ని పూర్తి చేయడానికి అందించిన డబ్బు షరతులతో కూడుకున్నదని కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







