ఇద్దరు ప్రవాసులను ఉరి తీయాలని నిర్ణయించిన కువైట్
- December 07, 2022
కువైట్ సిటీ: కువైట్ కాసేషన్ కోర్టులోని క్రిమినల్ విభాగం ఇద్దరు ప్రవాసులకు ఉరిశిక్ష విధించింది.వారిలో ఒకరు సుడాన్ పౌరుడు కాగా, మరోకరు ఈజిప్టియన్, సుడాన్ దేశస్థుడు తన మాజీ భార్యను హత్య చేస్తే.. ఈజిప్ట్ వ్యక్తి కూడా భార్యను చంపిన కేసులోనే నిందితుడు.దీంతో వీరిద్దరిని ఉరితీయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. సుడాన్‌కు చెందిన వ్యక్తి సాల్మియాలోని మైదాన్ హవల్లీ ప్రాంతంలో నివాసం ఉండేది. ఇదే ప్రాంతంలో అతడి మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటోంది.తనకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెళ్లాడడం, తాను ఉంటున్న ప్రాంతంలోనే అతడితో కలిసి ఉండడం చూసి సుడాన్ వ్యక్తికి ఈర్ష్యను కలిగించింది. ఆమె పై కోపంతో రగిలిపోయాడు.
ఎలాగైన ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు.అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడికి ఒకరోజు ఆమె ఇంట్లో ఒంటరిగా కనిపించింది. దాంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఆమె చనిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.ఇలాగే ఈజిప్ట్ వ్యక్తి కూడా తన భార్యతో ఘర్షణ కారణంగా ఆమెను దారుణంగా చంపేశాడు.అనంతరం ఇంట్లోనే ఆమె మృతదేహాన్ని ఉంచేసి..16 ఏళ్ల కొడుకు, 17 ఏళ్ల కూతురితో కలిసి కువైట్ వదిలి స్వదేశానికి పారిపోయాడు.అతడి ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి ఈ విషయాన్ని అంతర్గత మంత్రిత్వశాఖకు తెలియజేశాడు.ఇలా తమ భార్యలను అతి కిరాతకంగా హతమార్చిన ఈ ఇద్దరు ప్రవాసులను కువైట్ కోర్టు ఉరి తీయాలని తాజాగా తీర్పును వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







