‘వారాహి‘ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384

- December 12, 2022 , by Maagulf
‘వారాహి‘ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384

హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించటం..వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్వయంగా వెల్లడించారు. ‘వారాహి’వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని..వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టంచేశారు కమిషనర్ పాపారావు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని..అన్ని నిబంధనలు ఉన్నాయిని వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు.

కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ వాహనం ఆర్మీ రంగులో ఉంది ఈ వాహనం రిజస్ట్రేషన్ కు రవాణాశాఖ అనుమతి ఉంటుందో ఉండదో..ఇదేమీ సినిమా కాదు ఇష్టమొచ్చిన వాహనాలు ఉపయోగించటానికి..పవన్ రీల్ లైఫ్ అనుకుంటున్నారేమో..ఇది రియల్ లైఫ్ అని తెలుసుకోవాలి..ఇటువంటి రంగు వాహనంతో పవన్ సినిమా స్టైల్లో ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదు ఇది పవన్ తెలుసుకోవాలి అంటూ వైసీపీ నేతలు పలు విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు చెక్ పెడుతూ..తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనాన్ని రిజస్ట్రేషన్ చేసింది. వారాహి నంబర్ ను స్వయంగా కమిషనరే ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు.

వారాహి వాహనం రంగుపై వైసీపీ నేతల విమర్శలకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావటంతో వైసీపీ ఇది కచ్చితంగా పెద్ద ఝలక్ అనే చెప్పాలి. వారి విమర్శలకు వారాహి రిజిస్ట్రేషన్ తో చెక్ పడింది. కానీ వైసీపీ నేతలు తమదైన శైలిలో ఇంకా ఎటువంటి లూప్ హోల్స్ వెదికి విమర్శలు చేస్తారో వేచి చూడాలి. వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసి రిజిస్ట్రేషన్ చేయటంతో జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం రేగింది. ఇప్పుడేమంటారో చెప్పండీ అంటూ వైసీపీ కౌంటరిస్తున్నారు జనసేన సైన్యం..

కాగా ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినూత్న రీతిలో వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఈ వాహనంతో ఓ వీడియో కూడా షూట్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే ఇక వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది సినిమా కాదు డబ్బులున్నాయి కదాని ఇష్టమొచ్చిన వాహనం కొనేసుకుని ఇష్టమైన రంగు వేసుకుని తిరిగేయటానికి..అంటూ వైసీపీ నేతలకు ఉన్న అవగాహనతో తమైనశైలిలో విమర్శలు సంధించారు. వీటికి పూర్తిగా చెక్ పెట్టింది తెలంగాణ రవాణా శాఖ ‘వారాహి’ రిజస్ట్రేషన్ తో..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com