శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు విడుదల...
- December 24, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి.ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు టీటీడీ సూచించింది.అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఆ రోజున వీఐసీ బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. భక్తులు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







