స్కూల్ పికప్, డ్రాప్-ఆఫ్‌ల కోసం ఆర్టీఏ ట్రాక్సీల ప్రీ-బుక్
- March 08, 2023
దుబాయ్: ఎమిరేట్‌లోని తల్లిదండ్రులు ఇప్పుడు స్కూల్ పికప్‌లు, డ్రాప్‌ల కోసం ఆన్‌లైన్ ట్యాక్సీలను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. నివాసితులు ప్రతిరోజూ, వారానికో లేదా నెలవారీగా నడిచే పాఠశాల కోసం టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాఠశాల బస్సులు లేని ప్రదేశాలలో పేరెంట్స్ కు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీఏ తెలిపింది. RTA దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ (DTC) యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంది. 'ఇన్-సేఫ్ హ్యాండ్స్' సేవ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు తీసికెళ్లి తెచ్చేందుకు టాక్సీలను ముందస్తుగా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని DTC డిజిటైజేషన్, కమర్షియల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా ఇబ్రహీం అల్ మీర్ అన్నారు. డిజిటల్ యాప్‌లో అందిస్తున్న సేవలకు డిమాండ్ పెరుగుతుందని, 2021-2022 మధ్య 122 శాతం పెరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







