యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడితో మాట్లాడిన షేక్ మొహమ్మద్
- March 08, 2023
యూఏఈ: యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తన మొదటి ఓపెన్ కాల్ చేసి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన అనుభవాలను అల్నెయాడి పంచుకున్నారు. సెప్టెంబర్ 2019లో ఎనిమిది రోజుల పాటు హజ్జా అల్మన్సూరి ISSకి వెళ్లిన తర్వాత మరింత మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతానన్న తన వాగ్దానాన్ని నిలబెట్టినందుకు షేక్ మహమ్మద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు నిమిషాల వీడియో కాల్ సమయంలో అల్నెయాడి కూడా ISS లోపల తేలుతున్న యూఏఈ ఆస్ట్రో బొమ్మ సుహైల్‌ను ప్రదర్శించారు.
2019లో అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి యూఏఈ వ్యోమగామి కల్నల్ హజ్జా అల్ మన్సూరి.. తాను రెండు రోజుల క్రితం అల్నెయాడితో మాట్లాడినట్లు చెప్పారు. షేక్ మొహమ్మద్ 2019లో ISSలో తన రెండవ రోజు వ్యోమగామి హజ్జా అల్మన్సూరితో సంభాషించారు.
అల్నెయాడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన ఆరు నెలల మిషన్‌లో భాగంగా 5 రోజలు పూర్తి చేసుకున్నారు. తనతోపాటు నాసా వ్యోమగాములు స్టీఫెన్ బోవెన్, వారెన్ హోబర్గ్, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ లు శుక్రవారం ఉదయం 10.40 గంటలకు (UAE సమయం) ISSలోని క్రూ డ్రాగన్ ఎండీవర్‌లో సురక్షితంగా డాక్ అయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …