కువైట్ జనాభాలో 66% నాన్-కువైటీలు
- March 09, 2023
కువైట్: కువైట్ రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ వివరాల ప్రకారం.. కువైట్ మొత్తం జనాభా 4,385,717. ఇందులో 34% ( 1,488,716) మంది కువైటీలు ఉన్నారని సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కువైటీల సంఖ్య 904,688కి చేరుకుంది. కువైట్ స్త్రీల సంఖ్య 759,578 కాగా, కువైట్ పురుషుల సంఖ్య 729,638 అని తెలిపింది.అదే సమయంలో కువైటీలు కాని వారి సంఖ్య 2,897,001(66%)కి చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. కువైటీలు కానివారిలో 1,941,628 మంది పురుషులు, 955,393 మంది స్త్రీలు ఉన్నారు. నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారి సంఖ్య 151,992 కాగా, ప్రవేశ వీసాలు 94,879, వీసా ఉల్లంఘించిన వారి సంఖ్య 26,985 అని కువైట్ రిజిస్ట్రేషన్ సెన్సస్ గణాంకాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







