అక్రమంగా విరాళాలు సేకరణ.. మస్జీద్ ఇమామ్ అరెస్ట్
- March 09, 2023
రియాద్: అక్రమంగా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించినందుకు రియాద్‌కు తూర్పున ఉన్న ఒక మస్జిద్ ఇమామ్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇమామ్ మస్జీద్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు ఇనుముతో తాత్కాలిక షెల్టర్‌ను నిర్మించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. అనుమతించబడిన అధికారిక మార్గాల ద్వారా మినహా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించడాన్ని నిషేధిస్తూ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్లను ఇమామ్ ఉల్లంఘించారని తన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి మంత్రిత్వ శాఖలోని సమర్థ అధికారులకు కేసు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. మస్జిద్ ఉద్యోగులు ఎవరైనా విరాళాల సేకరణలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించినట్లయితే, మంత్రిత్వ శాఖ బెనిఫిషియరీ సర్వీసెస్ సెంటర్ (1933)కు నివేదించాలని పౌరులు, ప్రవాసులకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







