మూడవ సారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్
- March 10, 2023
బీజింగ్: జీ జిన్‌పింగ్ వరుసగా మూడోసారిచైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 వేల మంది ఉన్న చైనా రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్ష పోటీలో మరొకరు లేకపోవడంతో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ‘రాయిటర్స్’ తెలిపింది. అలాగే, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు.
ఝావో లెజీ పార్లమెంట్ నూతన చైర్మన్‌గా, హాన్ ఝెంగ్ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలోనూ వీరిద్దరూ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలోని జిన్‌పింగ్ బృందంలో ఉన్నారు. గతేడాది అక్టోబరులో జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. వరుసగా ఎన్నికవుతున్న ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి. దేశానికి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలన్న నిబంధనను 2018లో జిన్‌పింగ్ ఎత్తివేశారు. ఫలితంగా ఆయన రిటైర్ అయ్యే వరకు లేదంటే మరణించే వరకు, లేదంటే బహిష్కృతయ్యే వరకు ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







