మాస్ కా దాస్ ‘ధమ్కీ’.! ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్.!
- March 10, 2023
మాస్ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తాజా సినిమా ‘ధమ్కీ’. వాయిదాల పర్వం ముగించుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమా మార్చిలో మూడు రిలీజ్ డేట్లు సెట్ చేసుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24కు వాయిదా పడింది. మళ్లీ మార్చి 31న రిలీజ్ అన్నారు.
కానీ, సడెన్‌గా మార్చి 22న పక్కా.. అంటూ తాజాగా ఫిక్స్ అయిన రిలీజ్ డేట్‌ని మేకర్లు ప్రకటించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ సర్వం తానే అయ్యాడు.
ప్రొడక్షన్‌తో పాటూ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌నీ తానే డీల్ చేసుకున్నాడు. ఇక, సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో, ప్రమోషన్లు షురూ చేసే యోచనలో వున్నాడు మాస్ కా దాస్.
తన సినిమాల్ని వినూత్నంగా ప్రచారం చేసుకోవడంలో విశ్వక్ సేన్ ముందుంటాడు. మరి, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏం కొత్త ప్రయోగాలు చేయనున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







