ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష ప్రారంభం...
- March 10, 2023
న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు. దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంగీభావం తెలిపారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.
కాగా, 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటులో బిజెపికి పుల్ మెజార్టీ ఉందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







