కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్: సెమీఫైనలిస్ట్ లో ఇండియాస్ గ్రీన్ హార్ట్ డాక్యుమెంటరీ
- March 12, 2023
హైదరాబాద్: కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెమీ..ఫైనలిస్ట్ విభాగంలోకి చేరింది ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ డాక్యుమెంటరీ.ఇప్పటికే తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సుశీల్ రావు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గతేడాది డిసెంబర్ 15న ప్రివ్యూ థియేటర్లో అవార్డుల వేడుకలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఉత్తమ దర్శకుడు – డాక్యుమెంటరీ షార్ట్ కింద ఎంపికైనట్టు తెలిపారు.తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి సమీపంలోని రాఘవపురంలో తన 70 ఎకరాల పూర్వీకుల భూమిలో అడవిని సృష్టించాడు. అక్కడే ‘ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ’సుమారు 69 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణవేత్తగా దుశర్ల సత్యనారాయణ ఆరు దశాబ్దాల కిందనే అడవిని అభివృద్ధి చేయడం ప్రారంభించారు.1908లో హైదరాబాద్‌లో మూసీ నది వరదల సమయంలో 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టుపై చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన ‘ది గ్రేట్ ఇండియన్ టామరిండ్ ట్రీ’ అనే మరో డాక్యుమెంటరీ డిసెంబర్ 2022లో జరిగిన 11వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. సుశీల్ రావు రూపొందించిన ‘ఆన్ ట్రైల్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్’ అనే డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మకమైన ‘ఫెస్టివల్ డి కేన్స్” కోసం పంపించారు. ఇక 76వ కేన్స్ ఫెస్టివల్–2023 మే 16-27, 2023 వరకు జగనుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







