‘విశ్వక్ ఇక పై నువ్వు డైరెక్షన్ ఆపెయ్..’ - ఎన్టీయార్.!
- March 18, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కేవలం హీరో మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్షన్‌లోనూ, ప్రొడక్షన్‌లోనూ మనోడికి పక్కా అనుభవం వుంది. ఆల్రెడీ తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్’ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమానే.
ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ ‘ధమ్కీ’ అనే సినిమాకి సొంత డైరెక్షన్ చేశారు విశ్వక్ సేన్. ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీయార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్.. ‘విశ్వక్ నువ్వు డైరెక్షన్ మానేయ్..’ అనేశాడు. అంటే, విశ్వక్‌ని తక్కువ చేయడానికి కాదు.. విశ్వక్‌లాంటి హీరోల్ని డైరెక్ట్ చేసే మరెంతో మంది ఎంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేయడానికే ఎన్టీయార్ అలా అనేశాడు. అదీ సంగతి.
విశ్వక్ ఎలాగూ హీరోగా తన సత్తా చాటేశాడు. చాటుతూనే వున్నాడు. అలాగే, కొత్తగా డైరెక్షన్ ఫీల్డ్‌లోకి వచ్చే డైరెక్టర్లను విశ్వక్ లాంటోళ్లు ఎంకరేజ్ చేస్తే.. ఆ తర్వాత మాలాంటి సీనియర్ హీరోలు కూడా ఎంకరేజ్ చేసే అవకాశముంటుందన్నదే ఎన్టీయార్ వుద్దేశ్యమన్న మాట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







