మెగా హీరో కోసం ఆ మాలీవుడ్ హీరో విలన్‌గా.!
- March 18, 2023
టాలీవుడ్‌లో మలయాళ హీరోల హవా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మలయాళ ప్రముఖ హీరోలు, తెలుగులో విలన్లుగా వర్ధిల్లుతున్నారు. టాలీవుడ్ హీరోలకు ధీటైన విలన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఫహాద్ పాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కోసం ఓ మలయాళ నటుడు తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా పరిచయం కాబోతున్నాడు. ఆయన మరెవరో కాదు, జోజూ జార్జ్. ‘ఇరాట్టా’ సినిమాతో ఇటీవలే ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడీయన. ఇక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్‌గా మరింత దగ్గర కానున్నాడన్న మాట.
శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







