హైదరాబాద్‌కు 'అజార్'
- May 07, 2016
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా రూపొందిన 'అజార్' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టైటిల్ రోల్‌ను ఇమ్రాన్ హష్మి పోషించిన ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఇందులో అజార్ మొదటి భార్య నౌరీన్ పాత్రలో ప్రాచీ దేశాయ్, రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో అజారుద్దీన్ స్వయంగా పాల్గొంటుంటడం గమనార్హం. అందులో భాగంగా ఈనెల12న (గురువారం) అజార్, ఇమ్రాన్ హష్మి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడి అభిమానులతో వారు ఇంటరాక్ట్ అవనున్నారు. వారి కోసం హైదరాబాద్ యాసలో మాట్లాడేందుకు అజార్ నుంచి ఇమ్రాన్ సూచనలు అందుకున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు సినిమా బృందం ప్రచార కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టింది. ఇటీవల నిర్మాతలతో కలిసి హీరో ఇమ్రాన్ 'అజార్ఏంథమ్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ''అజార్ఏంథమ్లో భాగమయ్యేందుకు మీకు మంచి అవకాశం. క్రికెట్ ఆడుతున్న మీ ఫొటోల్ని కానీ, వీడియో క్లిప్స్ కానీ పంపించండి'' అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు ఇమ్రాన్.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







