పూరి డైరెక్షన్ లో నటించనున్న వెంకటేష్
- May 07, 2016
టాలీవుడ్ అగ్ర కథానాయకులు మైల్ స్టోన్ మూవీస్ కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను ప్రారంభించగా, నందమూరి బాలకృష్ణ కూడా 100వ సినిమాను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో మరో సీనియర్ హీరో జాయిన్ అవుతున్నాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన కెరీర్ లో 75 సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం తన 73వ సినిమాగా మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు. ఈ రెండు సినిమాల తరువాత తన 75 సినిమాను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే వెంకీ కోసం ఓ లైన్ సిద్ధం చేశాడట. వెంకీకి కూడా ఆ లైన్ నచ్చటంతో పూర్తి స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం రోగ్ సినిమాను పూర్తి చేసిన పూరి, కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాను ప్రారంభించాడు. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి వెంకటేష్ సినిమా ఈ సినిమాలు పూర్తయ్యాక ఉంటుందా..? లేక మధ్యలోనే పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







