బర్త్ డే స్పెషల్: మాస్ కా మ్యాజిక్ దాస్ విశ్వక్ సేన్.!
- March 30, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని తెలిసిందే. ఈ ‘మాస్ కా మ్యాజిక్ దాస్’ ఏంటీ అనుకుంటున్నారా.? అవును ఇప్పుడు విశ్వక్ సేన్‌ని అంతా ఇలాగే పిలుస్తున్నారు. తన సినిమాలతో ఏదో తెలీని మ్యాజిక్ చేస్తుంటాడీ మాస్ కా దాస్.
ఇటీవలే ‘ధమ్కీ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సూపర్.. బంపర్ అనలేం కానీ, ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.
ప్రస్తుతం ఓ మోస్తరు స్టార్ హీరోల్లో ఒకడిగా ఇమేజ్ దక్కించుకున్నాడు మనోడు. అసలే మల్టీ టాలెంటెడ్. యాక్టర్ మాత్రమే కాదు, డైరెక్షన్ డిపార్టుమెంట్‌లోనూ అనుభవం వుంది. సో, నటుడిగా తాను సినిమాలు చేయడమే కాదు.. ఎన్టీయార్, బాలయ్య వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసేస్తా.. అని కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నాడు.
అదీ మనోడి సత్తా. అన్నట్లు నందమూరి హీరోలకు పిచ్చ అభిమాని అయిన విశ్వక్ సేన్ త్వరలోనే తన సినిమాలో బాలయ్యతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడట.
ఆ సినిమా వివరాలేంటో త్వరలోనే వెల్లడి కానున్నాయ్. కానీ, మనోడి పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియాలో మాస్ కా దాస్‌కి బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







