'క్రియేట్ యాప్స్ ఇన్ దుబాయ్‌'ని ప్రారంభించిన షేక్ హమ్దాన్

- March 30, 2023 , by Maagulf
\'క్రియేట్ యాప్స్ ఇన్ దుబాయ్‌\'ని ప్రారంభించిన షేక్ హమ్దాన్

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం  'క్రియేట్ యాప్స్ ఇన్ దుబాయ్‌'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ.. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్‌మెంట్, డిజిటల్ ఎకానమీని పెంచుతుందన్నారు. ఎమిరేట్‌లో డిజిటల్ అప్లికేషన్‌ల కోసం ఆవిష్కరణ-ఆధారిత పర్యావరణ వ్యవస్థ,  2025 నాటికి వ్యాపార అవకాశాల కోసం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా దుబాయ్‌ని మారుస్తుందని తెలిపారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. దుబాయ్ ఇంటర్నెట్ సిటీని ప్రారంభించినప్పటి నుండి డిజిటల్ రంగంలో ఎమిరేట్  వ్యూహాత్మక పెట్టుబడులు గ్లోబల్ టెక్నాలజికల్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక ముఖ్యమైన ప్లేయర్‌గా మారుతున్నాయని ఆయన అన్నారు.1,000 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యూఏఈ జాతీయుల అభివృద్ధికి ఒక వేదికను అందించడం ద్వారా దుబాయ్ ఈ ప్రపంచ రేసులో ముందంజలో ఉండాలని కోరుతోందని,  వారి ఆలోచనలు, ఆవిష్కరణలు దుబాయ్‌లో శక్తివంతమైన అప్లికేషన్ల రంగాన్ని సృష్టిస్తాయని క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. పోటీలో పాల్గొనేందుకు.. మరిన్ని వివరాలు  www.createapps.ae వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com