సల్మాన్ ఖాన్ సినిమాలో ‘బతుకమ్మ’ పాట.! అందుకోసమేనా.?
- March 31, 2023
ఇప్పుడు భాషతో సంబంధం లేదు సినిమాలకి. ప్యాన్ ఇండియా అనే ట్యాగ్ మాత్రమే. ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కోసం అన్ని రకాల భాషల నటీనటులు కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటీనటలు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. సౌత్ యాక్టర్స్ నార్త్‌లోనూ నటిస్తున్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న బాలీవుడ్ మూవీ ‘కిసీ కి భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో తెలుగు పాటను అదీ తెలంగాణా ట్రెడిషనల్ సాంగ్ అయిన ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ పాటను పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో పూజా హెగ్దే, వెంకటేష్, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్దే క్యూట్ క్యూట్ స్టెప్పులేస్తుండగా, వెంకటేష్, సల్మాన్ ఖాన్ పంచె కట్టుల్లో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు.
ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







