పరీక్షల ఒత్తిడిని తట్టుకోవాలంటే పిల్లల డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరి.!
- March 31, 2023
పరీక్షల టైమ్ నడుస్తోంది. ఈ టైమ్‌లో పిల్లలు సహజంగానే ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో, తీవ్రమైన తలనొప్పి, జీర్ణక్రియ ఇబ్బందులు తదితర సమస్యలు తలెత్తుతాయ్.
ఆయా సమస్యల నుంచి పిల్లలను కాపాడేందుకు, సజావుగా వారు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆహారంలో ఈ పదార్ధాలను ఖచ్చితంగా వుండేలా చూసుకోవాలి.
గోధుమలతో చేసిన వంటకాలు తినిపించడం వల్ల నిస్సత్తువ, నీరసం తగ్గుతుంది. గోధుమలతో చేసిన వంటకాలు తినడం వల్ల కాస్త మందంగా అనిపిస్తుంది. కానీ, ఎక్కువ సమయం శరీరానికి శక్తి అందించడంలో ఇవి తోడ్పడతాయ్.
అలాగే, కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా వుండే, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా అందించాలి. తాజా పండ్లు, కూరగాయలు కంపల్సరీ. అరటి పండు తినిపించడం మర్చిపోవద్దు. కాల్షియం ఎక్కువగా వుండే ఉడికించిన గుడ్డు పిల్లలను ఒత్తిడికి దూరం చేస్తుంది. సో, డైలీ ఓ గుడ్డు పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల ఆరోగ్యానికి మంచిది సుమా. అలాగే మొలకెత్తిన గింజలు మెదడు పని తీరును ఆరోగ్యంగా వుంచి జ్ఞాపక శక్తిని పెంచుతాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







