వాహనాలను ఢీకొట్టి.. గాలిలోకి కాల్పులు జరిపిన డ్రైవర్ అరెస్ట్
- April 01, 2023
రియాద్ : ఉద్దేశపూర్వకంగా అనేక వాహనాలను తన కారుతో ఢీకొట్టి, అనంతరం గాలిలో కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సౌదీ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. దక్షిణ రియాద్‌లోని అనేక కార్ షోరూమ్‌లు ఉన్న వీధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. ఏడు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. కారు డ్రైవర్, అతని సహచరుడి వికృత చర్యల గురించి సోషల్ మీడియాలో వైరలయిన వీడియో తమ దృష్టికి రావడంతో భద్రతా పెట్రోలింగ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని రియాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు. అసాధారణ స్థితిలో ఉన్న వ్యక్తిని గస్తీ బృందాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆ వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశామని, అతని సహచరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







