రైలు నెట్‌వర్క్ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించిన ఒమన్, యూఏఈ
- April 01, 2023
మస్కట్: ఒమన్ రైల్- ఎతిహాద్ రైల్ డైరెక్టర్ల బోర్డు మస్కట్‌లో ఒమన్-యూఏఈ రైలు నెట్‌వర్క్ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించింది. ఒమన్- ఎతిహాద్ రైల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యులు కంపెనీ సాధించిన విజయాలు, ఒమన్-యూఏఈ రైలు నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌పై అత్యంత ముఖ్యమైన పరిణామాలు, పరిశోధన, అధ్యయనాలను సమీక్షించారు. మస్కట్‌లో జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో జాయింట్ నెట్‌వర్క్ పనుల పురోగతి, ఇంజనీరింగ్ డిజైన్‌లు, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఆధారంగా అందించే వ్యవస్థలపై సభ్యులకు అధికారులు వివరించారు. సమీకృత రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను.. తాజా సాంకేతికత వ్యవస్థలను వినియోగించుకోవాలని బోర్డు సభ్యులు ఈ సందర్భంగా సూచించారు. సోహార్ పోర్ట్‌ను యూఏఈ జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే రైలు నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌కు రెండు దేశాల నాయకత్వం ఇచ్చిన మద్దతును ఒమన్ - ఎతిహాద్ రైల్ డైరెక్టర్ల బోర్డు ప్రశంసించింది. రెండు దేశాలలో స్థిరమైన అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అత్యున్నత స్థాయి భద్రత, రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి, నిర్వహణ ద్వారా స్థిరమైన అభివృద్ధి ప్రక్రియను సాధించడం, ఇరుపక్షాల మధ్య సోదర సంబంధాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని బోర్టు తెలిపింది. ఈ సమావేశానికి రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఒమన్ -ఎతిహాద్ రైల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ సైద్ బిన్ హమూద్ అల్ మవాలీ, యూఏఈ పవర్, మౌలిక సదుపాయాల మంత్రి హిస్ ఎక్సలెన్సీ సుహైల్ బిన్ మహ్మద్ ఫరాజ్ ఫారిస్ అల్, రైల్ బోర్డు సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







