వైల్డ్ ప్రమోషన్స్‌లో ‘ఏజెంట్’ అఖిల్.!
- April 18, 2023
‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ చాలా చాలా కష్టపడుతున్నాడు. ఈ నెలాఖరులో ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు ‘ఏజెంట్’ టీమ్.
ఆల్రెడీ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లూ మొదలెట్టేశారు. కానీ, ఇది చాలదు. ఇంతకు మించి అనే రేంజ్‌లో వుండాలి. అందుకే ‘ఏజెంట్’గా థింక్ చేసినట్లున్నాడు అఖిల్.
విజయవాడలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా వుంది ‘ఏజెంట్’ అండ్ టీమ్. ఈ నేపథ్యంలో 150 అడుగుల ఎత్తున్న ఓ షాపింగ్ మాల్ నుంచి రోప్ సహాయంతో కిందకి దూకి ఆడియన్స్ అటెన్షన్‌ని తన దృస్టికి తీసుకొచ్చే పని చేశాడు అఖిల్.
ఏంటీ.! 150 అడుగుల ఎత్తులోంచి దూకడమా.! ఇదేం క్రేజీనెస్.. అంటారా.? ఏం చేస్తాడు ఇలాంటి క్రేజీ థింగ్ ఏదో ఒకటి చేయకుంటే, ‘ఏజెంట్‌పై అనుకున్న బజ్ క్రియేట్ చేయడమెలా.? రిస్క్ చేయకపోతే లైఫ్‌లో మిగిలేది రస్క్ మాత్రమే. అఖిల్ చెప్పిన మాటే అది. అందుకే రీల్‌లోనే కాదండోయ్.. రియల్‌గానూ హీరోలా ఆలోచిస్తున్నట్లున్నాడీ అక్కినేని బుల్లోడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







