14 మొబైల్ యాప్స్ పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
- May 01, 2023
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లుగా వీటిని ఉపయోగిస్తున్నారని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. రక్షణ దళాలు, భద్రత, ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లు బ్లాక్ చేయబడ్డాయి.
కేంద్రం బ్లాక్ చేసిన అప్లికేషన్లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్ మొదలగు యాప్స్ ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై అణిచివేత కొత్తేమీ కాదు.. గతంలో కేంద్రం ప్రభుత్వం పలు చైనీస్ యాప్‌లను నిషేధించింది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 250 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







