రియల్ ఎస్టేట్ మోసాలపై ఉక్కుపాదం
- May 10, 2016
వినియోగదారుల్ని 'కోల్డ్ కాల్స్'తో మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేదా ఆ ముసుగులో మోసాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించనున్నామని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (రెరా) స్పష్టం చేశాయి. రియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ 'రెరా' డైరెక్టర్ జనరల్ అలీ అబ్దుల్లా అలి మాట్లాడుతూ, మోసాలకు పాల్పడే ఏజెన్సీలకు 50,000 దిర్హామ్‌ల ఫైన్ విధిస్తామని, ఇండివిడ్యువల్ ఏజెంట్స్‌పై నెలపాటు సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా ప్రజలు వెంటనే అధికారుల్ని సంప్రదించాలనీ, ఫిర్యాదులు నమోదు చేయాలని ఆయన సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏజెంట్లు, సంస్థలు వ్యవహరించిన పక్షంలో వారిపై ఇంకా కఠిన చర్యలకు వెనుకాడబోమని అల్ అలి చెప్పారు. బ్రోకరేజ్ సంస్థలు, తమ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రచారాలకు అనుమతి తీసుకోవాలనీ, ఇందులో తమ వినియోగదారుల వివరాల్నీ పేర్కొనాలని, అర్హత లేనివారి ద్వారా ఫోన్లు చేయించడం, వాట్సాప్ ద్వారా ప్రచారాలు చేయడం నిషిద్ధమని ఆయన వివరించారు
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







