కోహినూర్ కంటే అతి పెద్ద వజ్రం దుబాయ్‌లో!
- May 10, 2016
ఇండియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో కోహినూర్ డిమాండ్ వివాదం ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునే అంశమైంది. బ్రిటన్ రాజమాత కిరీటంలో ప్రస్తుతం పొదగబడి ఉన్న ఈ వజ్రం, వాస్తవానికి భారతదేశంలో లభించింది. అలా అలా బ్రిటన్‌కి చేరిన ఈ వజ్రం గురించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అతి గొప్ప వజ్రం ఏదంటే అది ఖచ్చితంగా కోహినూర్ మాత్రమే. అయితే దీన్ని తలదన్నే వజ్రాన్ని దుబాయ్‌లో తయారు చేయనున్నారట. అంగోలాలో లభ్యమైన రఫ్ డైమండ్ బరువు 404 క్యారెట్లు. దీన్ని గ్రిసోగోనో సంస్థ పాలిష్ చేయనుంది. అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వేస్టేజ్ తక్కువగా ఉండేలా ఈ వజ్రానికి మెరుగులు దిద్దుతారు. కోహినూర్ వజ్రం రఫ్ స్టేజ్‌లో 793 క్యారెట్లు. అనేకసార్లు దాన్ని పాలిష్ చేయగా, 105.6 క్యారెట్ల వజ్రంగా రూపొందింది. కోహినూర్ కన్నా పెద్దగా తాము కనుగొన్న వజ్రాన్ని రూపొందిస్తామని గ్రిసోగోనో సంస్థ వెల్లడించింది. దుబాయ్ వజ్రాల వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిందనీ, దుబాయ్‌లో తాము వజ్రాల వ్యాపారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు







