ఎగ్జిబిషన్‌లో ఉద్యోగావకాశాలు
- May 10, 2016
300కి పైగా ఉద్యోగావకాశాలు రెండు రోజులపాటు సాగిన ఎగ్జిబిషన్‌లో బహ్రెయినీలకు దక్కాయి. కామర్స్ అండ్ టూనిజం అలాగే లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ వర్గాలు సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్‌ని నిర్వహించాయి. మే 8 నుంచి 10 వరకు జాయెద్ టౌన్‌లో జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో సూపర్ విజన్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఔత్సాహికులకు ఉద్యోగాలు లభించాయి. లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జమీల్ హుమాయిదాన్, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ బిన్ రషీద్ అల్ జయాని ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. 70 సంస్థలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. నెలకు 600 బహ్రెయినీ దినార్లకు తగ్గకుండా వేతనంతో సుమారు 300 ఉద్యోగాలు బహ్రెయినీలకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా దక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఉద్యోగార్థులకు వారి వారి క్వాలిఫికేషన్, సమర్థతను బట్టి ఉద్యోగాలు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







