బహ్రెయిన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌డేకి ఆమోదం

- May 10, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌డేకి ఆమోదం

బహ్రెయిన్‌ సరికొత్త 'నేషనల్‌ స్పోర్ట్స్‌ డే'ను పొందనుంది. బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ తాజాగా ఈ నిర్ణయం ప్రకటించింది. 2017 నుంచి బహ్రెయిన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ డేను అధికారికంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో నేషనల్‌ స్పోర్ట్స్‌ డే నిర్వహించబడుతుందనీ, ఆరోగ్యవంతమైన బహ్రెయిన్‌ కోసం ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్‌ డే ను జరుపుకోవాలని ఒలింపిక్‌ కమిటీ పిలుపునిచ్చింది. ప్రెసిడెంట్‌ షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా అధ్యక్షతన జరిగిన ఏడవ బిఓసి బోర్డ్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 17వ అరబ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ని అల్జీరియాలో గెలచుకున్నందుకు అభినందనలు తెలిపారు. మొత్తం 20 మెడల్స్‌ని (14 బంగారం, 5 వెండి, 1 కాంశ్యం) బహ్రెయిన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ గెల్చుకుంది. ఇదిలా ఉండగా నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్స్‌ ఎన్నికల్ని జరపాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com