డెస్క్‌టాప్ యాప్ వాట్సాప్ వెబ్ తరహాలో
- May 11, 2016
మొబైల్, ట్యాబ్ ద్వారా బిలియన్కు పైగా యూజర్లను సొంతం చేసుకున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై డెస్క్టాప్ల్లోనూ అందుబాటులోకి రానుంది. డెస్క్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా యాప్‌ను విడుదల చేసింది సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్. ఇకపై ఈ డెస్క్‌టాప్ బ్రౌజర్‌తోనే మెసేజ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.
విండోస్ 8, ఆ తర్వాతి వెర్షన్లు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఈ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ పనిచేస్తుంది. డెస్క్‌టాప్‌లోనే ఈ యాప్ నేరుగా రన్ అవుతుండటంతో.. అన్ని షార్ట్‌కట్ ఆప్షన్స్ పనిచేస్తాయి.
అయితే ఇప్పటికే మొబైల్ ద్వారా వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌కు అనుసంధానం చేసే సదుపాయం అందుబాటులో ఉంది. వాట్సాప్ వెబ్ అనే ఫీచర్‌తో మొబైల్ వాట్సాప్ యాప్‌ను స్కాన్ చేసి డెస్క్‌టాప్‌లో మెసేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ డెస్క్‌టాప్ యాప్ వాట్సాప్ వెబ్ తరహాలోనే ఉంటుంది. అయితే మొబైల్ ద్వారా స్కాన్ చేసుకునే అవసరం లేకుండా.. నేరుగా డెస్క్‌టాప్‌లోనే వాట్సాప్ ఖాతాలు తెరుచుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







