ఇర్ఫాన్ ఖాన్ అబ్దుల్ కలాంగా..
- May 11, 2016
ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోగలరు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జీవితాధారంగా రానున్న సినిమాలో ఇర్ఫాన్ నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం.మరాఠీ నిర్మాత ప్రమోద్ గోరె కలాం జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాల గురించి సినిమా నిర్మించనున్నారు. సినిమా చిత్రీకరణకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారు. ఇందులో ఇర్ఫాన్‌ని ఎంపికచేసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. సినిమా కోసం ప్రమోద్ రామేశ్వరంలోని కలాం ఇంటికి వెళ్లి అతని సోదరుడిని కలిసి కలాం గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు.సినిమాకి 'ఏపీజే' టైటిల్‌ను ఖరారు చేశారు. జులై-ఆగస్టు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాను 2017లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం చేయనున్నారన్నదితెలియాల్సి ఉంది. 'దేశం కోసం కలాం ఎంతో చేశారు. భారతీయులందరికీఆయనే స్ఫూర్తి. సినిమాలో కలాం గురించి పూర్తిగా తెలియజేయడానికే రామేశ్వరం వెళ్లి ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. అదీకాకుండా సినిమా చేయడానికి ముందు కలాం కుటుంబీకుల అనుమతి తీసుకోవాలనుకున్నాను.''ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి కలాం రాసిన 22 పుస్తకాలను కొనుగోలు చేశాను. ఆయన గురించి చెప్పాలంటే రెండున్నర గంటల సినిమాలో చెప్పలేం. ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోతారనే ఇర్ఫాన్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇర్ఫాన్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది' అని చెప్పారు ప్రమోద్ గోరె.
తాజా వార్తలు
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు







