ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- May 19, 2023
ముంబై: ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్ నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తివద్ద 4.2 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దాని విలువ రూ.2.28 కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని పొడిగా మార్చి పాయింటు లోపల, లోదుస్తులు, మోకాలికి ధరికి క్యాప్‌ల్లో తరలిస్తున్నాడని తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తమ ఆదీనంలోకి తీసుకున్నామని చెప్పారు.
కాగా, గత నెలలో ముంబయి విమానాశ్రయంలో విదేశీ సిగరేట్లను అక్రమంగా తరలిస్తున్నందుకుగాను 55 కేసులు నమోదుచేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మొత్తం 9,36,700 సిగరెట్లను సీజ్ చేశామని తెలిపారు. వాటి విలువ రూ.41 లక్షలు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







