హైదరాబాద్‌లో జాప్‌కామ్ సెంటర్..
- May 19, 2023
అమెరికా: అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే డిస్కవరీ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
వాషింగ్టన్ డీసీలో జరిగిన భేటీలో జాప్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐ, ఎన్ఎల్పీ ఉత్పత్తులను జాప్‌కామ్ కంపెనీ రూపొందించనున్నది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జాప్‌కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాతో పాటు సెంట్రల్ అమెరికా, ఇండియాలోనూ ఆ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. ఆ తర్వాత ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







