యుక్తా 6 వ వార్షికోత్సావ కార్యక్రమానికి పవర్ స్టార్ ముఖ్య అతిథి..
- May 11, 2016
ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) వారు తమ 6 వ వార్షికోత్సాన్ని లండన్‌లోని ట్రాక్సీలో ఘనంగా జరుపబోతున్నారు. జూలై 9న జరిగే ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగుసంఘం వారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జూలై 9, శనివారం సాయంత్రం 5గం.ల నుండి రాత్రి 11గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ లో తెలుగు వారందరిని అలరించడానికి చలన చిత్ర గానామృతం, నృత్య రూపకాలు, జానపద గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇక తెలుగు వారందరు ఈ కార్యక్రమానికి హాజరై ఈవెంట్ ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల కోసం www.uktas.org.uk వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







