పెరిగిన పసిడి ధర..
- May 11, 2016
నగల వ్యాపారుల కొనుగోళ్లతో బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ.100 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,950కి చేరింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.7శాతం పెరిగి 1,274.65 యూఎస్ డాలర్లకు చేరింది.అలాగే వెండి ధర సైతం పెరిగింది. రూ.500 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దీని ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







