బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- May 11, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగర సమీపంలో షియాలు ఎక్కువగా ఉండే సదార్ సిటీలో బిజీ మార్కెట్లో కారుబాంబు పేలింది. దీంతో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భద్రత సిబ్బంది, ఇతర అధికారులు వెల్లడించారు. మరో 60 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నింపిన ఎస్‌యూవీని మార్కెట్లో ఉంచి పేల్చారు. బాధితుల్లో చాలా మంది మహిళలు ఉన్నట్లు సమచారం. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటన పట్ల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







