సౌదీ సంస్కృతిని చాటిచెప్పే సినిమా రంగం
- May 12, 2016
సౌదీ మూవీ డైరెక్టర్ మమ్దూ సలీం, దేశంలో సినిమా థియేటర్లు, మ్యూజిక్ కాన్సెర్ట్‌లకు సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్యాబినెట్‌ను ఇటీవలే పునర్‌వ్యవస్థీకరించారు. జనరల్ అథారిటీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జనరల్ సెక్రెటేరియట్ అడ్వయిజర్ అహ్మద్ బిన్ అకీల్ అల్ ఖతీబ్‌ను జనరల్ అథారిటీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. విజన్ 2030లో భాగంగా దేశంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతుందనీ, సౌదీ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి ఇంకా బాగా తెలియడానికి సినిమాలు ఉపయోగపడ్తాయని సలీమ్ చెప్పారు. యువత సినిమా, నాటకం, మ్యూజిక్, కళలు వంటి రంగాల పట్ల ఆసక్తి పెంచుకోవాలనీ, టూరిజం డెవలప్‌మెంట్‌పైనా దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్ళలో ఆర్ట్ అండ్ కల్చర్ రంగాల్లో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకుంటాయని సలీమ్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







