ఫైర్ డ్రిల్ కోసం దుబాయ్ ఎయిర్పోర్ట్ టన్నెల్ మూసివేత
- May 12, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) క్రైసిస్ మేఏజ్మెంట్ టీమ్, ఎయిర్పోర్ట్ టన్నెల్లో మాక్ ఫైర్ డ్రిల్ నిర్వహించనుంది. ఈ కారణంగా టన్నెల్‌ని మూసివేయనున్నారు తాత్కాలికంగా. టన్నెల్లో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం మరో వాహనాన్ని ఢీ కొడుతుందనీ, ఈ సిట్యుయేషన్ని డీల్ చేయడానికి క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఎలా పనిచేస్తుందనేది మాక్ డ్రిల్ ద్వారా పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు. ఉదయం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫైర్ డ్రిల్ 6 గంటల వరకు జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు సంబంధించిన కొన్ని సంస్థలు కూడా డ్రిల్‌లో పాల్గొంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమర్థవంతంగా స్పందించడం ద్వారా నష్టాన్ని నివారించేందుకు ఈ డ్రిల్ ఉపయోగపడ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. నేషనల్ ఎమర్జన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎమర్జన్సీ, క్రైసిస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, దుబాయ్ పోలీస్, దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్, దుబాయ్ మునిసిపాలిటీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ - వాటర్ అథారిటీ, దుబాయ్ హెల్త్ అథారిటీ, దుబాయ్ సివిల్ యావియేషన్ అథారిటీ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ఈ డ్రిల్‌లో పాల్గొంటున్నాయి
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







