'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది
- May 12, 2016
రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న 'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జూన్‌లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే, తాజాగా తేదీని జూలై 1గా ఖరారు చేశారు. జూలై 7కు విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలించినప్పటికీ, అదే తేదీన సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్రం వస్తుండటంతో దానితో పోటీ లేకుండా జూలై 1కి ఫిక్స్ అయ్యారని చిత్రవర్గాలు మీడియాకు తెలిపాయి.పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కబాలి' సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన తైవానీ నటుడు విన్స్టన్ చావో కూడా తాజాగా చెన్నైలోని డబ్బింగ్ టీమ్‌తో చేరాడు. రజనీతోపాటు రాధికా ఆప్టే, ధన్సికా, రిత్విక తదితరులు నటిస్తున్న ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







