ఐఎస్ మొబైల్ యాప్ విడుదల : పిల్లలు లక్ష్యంగా
- May 12, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చిన్నారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల కోసం ప్రత్యేకంగా మొదటిసారి మొబైల్ యాప్ విడుదల చేసినట్లు సమాచారం. దీని ద్వారా అరబిక్ అక్షరాలు, జిహాదీ విధానాలు.. గన్, రాకెట్, ట్యాంక్ తదితర ప్రమాదకరమైన వాటి గురించి నేర్పించడానికి యాప్ విడుదల చేశారు. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా పిల్లలకు అరబిక్ నేర్పేవారు కావాలని ఇస్లామిక్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ జీల్ ఓ అప్లికేషన్ విడుదల చేసినట్లు లాంగ్‌వార్ జర్నల్ పేర్కొంది.జిహాదీ విధానాలతో పాటు వారు ఉపయోగించే పదాలు, ఇస్లామిస్ట్ పాటలు, అరబిక్ అక్షరాలు, పదాలు నేర్పాలని ఉగ్రవాదులు చేసిన అప్లికేషన్ ఇస్లామిక్ స్టేట్ టెలిగ్రామ్ ఛానల్స్, ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ల ద్వారా విడుదలైంది. ఆ యాప్‌కు సంబంధించి పలు ఫొటోలు, స్క్రీన్‌షాట్స్ కూడా లైబ్రరీ ఆఫ్ జీల్ విడుదల చేసినట్లు లాంగ్‌వార్ జర్నల్ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చిన్నపిల్లలనూ వదలకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు బందీలను దారుణంగా చంపిన వీడియోలు గతంలో విడుదల చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







