తానా మహాసభలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు రాక
- June 07, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కూడా వారు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న వెంకయ్య నాయుడు పలు తానా కార్యక్రమాల్లో, మహాసభల్లో పాల్గొని ప్రసంగించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన తానా కళారాధన కార్యక్రమంలో కూడా వెంకయ్య నాయుడు పాల్గొని తానా సేవలను, తెలుగు భాషకు తానా చేస్తున్న సేవను ప్రశంసించిన సంగతి తెలిసిందే. వెంకయ్య నాయుడు రాక తానా మహాసభలకు మరో ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







