బాలీవుడ్ వీరప్పన్ విడుదలకు సిద్ధం
- May 12, 2016
సౌత్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్ లో మకాం వేసిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యే వీరప్పన్ సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ, అప్పుడే ఆ సినిమా రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశాడు. సౌత్ లో కేవలం వీరప్పన్ కోసం సాగించిన వేటనే కథాశంగా సినిమా రూపొందించిన వర్మ హిందీలో మాత్రం వీరప్పన్ జీవితకథను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ భరద్వాజ్ తో పాటు సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు కర్ణాటక మాఫియా డాన్ జీవిత కథ ఆధారంగా రాయ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో రాయ్ పాత్రలో వివేక్ ఒబరాయ్ నటిస్తున్నాడు. వర్మ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వివేక్. వీటితో పాటు టాలీవుడ్ లో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలోవంగవీటి సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వర్మ.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







