భారత విద్యార్థులకు కెనడా ప్రధాని మద్దుతు
- June 08, 2023
కెనడా: నకిలీ పత్రాలు సమర్పించిన దాదాపు 700మంది భారతీయ విద్యార్థులు బహిష్కరణకు గురికానున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత విద్యార్థులు కెనడాలో శాశ్వత నివాసం కల్పించాలంటూ రోడ్లపై ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. బుధవారం జరిగిన పార్లమెంట్ చర్చలలో ఆయన భారత విద్యార్థుల గురించి మాట్లాడుతూ.. 'నకిలీ కాలేజీ అడ్మిషన్ పత్రాలకు సంబంధించి భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి మాకు తెలుసు. ఈ కేసులో బాధితులైన విద్యార్థులకు జరిమానా విధించకుండా... దీనికి కారణమైన దోషులను గుర్తించే పనిలో ఉన్నాం' అని ఆయన అన్నారు. అలాగే భారత విద్యార్థులకు మద్దతుగా, బహిష్కరణ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కెనడా ఎన్డిపి పార్టీకి చెందిన సింగ్.. పార్లమెంటులో ఏకగ్రీవ సమ్మతి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తీర్మానం నకిలీ పత్రాల వల్ల దేశ బహిష్కరణకు గురయ్యే విద్యార్థులను రక్షిస్తుంది.
కాగా, కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సిబిఎస్‌ఎ) ఏడువందల మందికి పైగా భారతీయ విద్యార్థులు తమ విద్యా సంస్థ అడ్మిషన్ ఆఫర్ లెటర్లు నకిలీవి ఇటీవల గుర్తించింది. అయితే ఇందులో తమ తప్పేమీ లేదని.. ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీనే తమని మోసం చేసిందని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







