VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- June 28, 2026
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది. వారణాసి నగర మున్సిపల్ కార్పొరేషన్(VMC) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మేయర్ అశోక్ తివారీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో నగర పరిధిలో ఉన్న 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో దీపావళిలోపు విడతల వారీగా నగర శివార్లకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ దుకాణాలను రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో కాశీనగరం దేశంలోని రెండవ శాకాహార నగరంగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఏకైక పూర్తి శాకాహార పట్టణంగా గుజరాత్ రాష్ట్రంలోని ‘పాలితానా’ గుర్తింపు పొందింది. ఇక్కడ 2014 నుంచి మాసం, చేపలు, గుడ్లు విక్రయాలపై నిషేధం అమల్లోఉంది. వారణాసిలో హిందువులు 72శాతం, ముస్లింలు 27శాతం ఉన్నారనేఅంచనాలున్నాయి.
తాజా నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నగర పరిశుభ్రత, పుణ్యక్షేత్రం ప్రత్యేకత దృష్ట్యా స్వాగతిస్తుండగా.. మరికొందరు దుకాణాలు దూర ప్రాంతాలకు మారితే వినియోగదారులకు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం మాంసాహారాన్ని నిషేధించడం కాదని.. కేవలం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించి..అక్కడ వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







