ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది
- May 12, 2016
తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. 40 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నారు. బాధ్యతతో పనిచేసి మంచి పేరు తేవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు.పీహెచ్ సీ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.6వేల నుంచి రూ.12 వేలకు, నెట్ వర్క్ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.7 వేల నుంచి రూ.12వేలకు పెంచింది. వీరితో పాటు ఆరోగ్యశ్రీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







