తిరుపతిలో జరగబోయే మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానాలు..
- May 12, 2016
ఈ నెల 27వ తేదీ నుంచి తిరుపతిలో జరగబోయే మహానాడుకు ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ సెంటర్‌లోని హోటల్ ఇంటర్నేషనల్‌లో జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.రాష్ట్ర కమిటీ ప్రతినిధులు.. అతిథులకు గదులు, భోజనాల కల్పన, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నాయకులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకుని వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచినీరు, టాయిలెట్స్, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మంత్రి నారాయణలతో మాట్లాడారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







