నాచారం కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..
- May 12, 2016
నాచారం పారిశ్రామికవాడలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో కెమికల్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు.మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలకు అదుపు చేస్తున్నారు. మంటలు చట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







